- తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు
- ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత
- త్వరలోనే తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనిపై త్వరలోనే తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. సంస్థ ఛైర్మన్ యంగ్ లియుతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నట్లు యంగ్లియు తెలిపారు. యంగ్లియు నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ప్రభుత్వం తరపున అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల లభ్యత గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫార్చ్యూన్ 500 సంస్థ అయిన ఫాక్స్‌కాన్ అత్యధిక ఉద్యోగాలిస్తుందన్నారు.