అమెరికా మార్కెట్లలోకి ఇండియన్ ఈ కామర్స్ కంపెనీ లిస్ట్ కాబోతోందా..?

2021-03-04 16:35:58 By Anveshi

img

ఆన్‌లైన్ షాపింగ్‌కి ఒకప్పుడు మంచి ఆఫర్లతో పాపులర్ అయిన ఫ్లిప్‌కార్ట్ ఆమెరికా మార్కెట్లలో ఎంట్రీ కోసం ట్రై చేస్తోంది. దీంతో ఇక్కడ పుట్టిన కంపెనీ, భారత్‌లో లిస్ట్ అవకుండా  నేరుగా అమెరికాలో లిస్ట్ అవడం మన ఈకామర్స్ కంపెనీల సామర్ధ్యానికి గీటురాయిగా చూడాల్సిందే  

వాల్ మార్ట్ కంపెనీ మేజర్ వాటా తీసుకున్న తర్వాత, అమెజాన్‌తో పోటీ పడే స్థాయికి చేరింది ఫ్లిప్‌కార్ట్. ఐనా నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనేయూఎస్ఐపీఓకి వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనని కంపెనీ చేస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ కథనం ఒకటి ప్రచురించింది. అమెరికా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్ వేల్యేషన్ కూడా భారీగా ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది దాదాపు 35 బిలియన్ డాలర్ల మేర ఫ్లిప్‌కార్ట్ విలువ మదింపు చేయవచ్చని ఓ ప్రాథమిక సమాచారం అందుతోంది. 

స్పాక్ డీల్‌తో అమెరికాలో ఇలా లిస్టింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది. దీని కోసం గ్రోఫర్స్ సంస్థతో జట్టు కట్టే అవకాశం ఉంది. స్పాక్(SPAC)పూర్తి అర్ధం-  స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ.ప్రత్యేకమైన సందర్భాల్లో ఐపిఓ కోసం ఇన్వెస్టర్లు ఓ షెల్ కంపెనీని సృష్టించడమే ఈ డీల్స్ ఉద్దేశం. వాల్ స్ట్రీట్‌లో ఇలాంటి స్పాక్ డీల్స్ చాలానే జరుగుతుంటాయ్. గత వారం రెన్యూ పవర్ అనే కంపెనీ ఇలానే అమెరికా మార్కెట్లలో 800కోట్ల డాలర్ల వేల్యేషన్‌తో లిస్ట్ అయింది. ఇలా ఈ ఏడాది కాలంలో ఓ పది భారత కంపెనీలు ఈ బాటలోనే అమెరికా మార్కెట్లలో లిస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్ 2007లో ప్రారంభం కాగా, దాని పోర్ట్‌ఫోలియోలో 8 కోట్ల ఉత్పత్తులు అమ్ముడవుతుంటాయి. 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 1600కోట్లడాలర్లతో ప్రధాన వాటా కొనుగోలు చేసింది.
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending