ఎలక్ట్రిక్ వెహికల్ క్రేజ్ పెరుగుతోంది..  ధర తగ్గుతోంది.. కేవలం రూ.68,999కే..

2021-10-14 18:30:10 By VANI

img

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వెహికిల్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. వినియోగదారులు విపరీతంగా క్రేజ్ చూపించడం కూడా ఈవీ తయారీ కంపెనీలకు బాగా కలిసొచ్చింది. దీంతో దీంతో వినియోగదారులకు అందుబాటు రేంజ్‌లో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికిల్‌ను అందించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ ఎక్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ ధర కేవలం రూ.68,999(ఎక్స్ షోరూమ్, పూణే) మాత్రమే.

 

ఇక ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు.. 121 కిలోమీటర్లు(ఏఆర్ఏఐ పరీక్షించింది) వరకూ రయ్‌మంటూ దూసుకెళ్లనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కలర్స్‌లో లభించనుంది. మెటాలిక్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్, గెలాక్టిక్ గ్రే అనే కలర్స్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ లభించనుంది. ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ ఈ-స్కూటర్‌లో తేలికైన పోర్టబుల్ అధునాతన లిథియం బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని 5-యాంప్ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది.

 

 ఇంటి వద్ద, ఆఫీసు, కాఫీ షాప్ లేదా ఏదైనా ప్లగ్-ఆన్-ది-వాల్ తదితర ప్రదేశాల్లో హ్యాపీగా చార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇందులో 1200 వాట్స్ మోటార్ ఉంది. ఈ మోటార్ ఇంజిన్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలో అందుకుంటుంది. దీనిలో సూపర్ సేవర్ ఎకో మోడ్, పెప్పియర్ పవర్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్ లైట్, కీ లెస్ ఎంట్రీ, వేహికల్ ఫైండర్, యాంటీథెఫ్ట్ అలారం, పోర్టబుల్ బ్యాటరీ రీఛార్జ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 


Magnus Ex Scooter  Electric Vehicle  Pune  ARAI

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending