ప్రపంచంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్.. బెస్ట్ ఆఫర్ రెడీనా

2021-01-22 23:47:04 By Y Kalyani

img

ప్రపంచంలోనే నెంబర్ రిచెస్ట్ మ్యాన్.. బెస్ట్ ఆఫర్

విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, ప్రైవేటు అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ అధినేత బిలియనీర్ ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాలుష్యానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే బెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్లకు 100 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తామని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు  ఉన్న సాంకేతికత పురోగతి చాలా తక్కువ. గాలి నుంచి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను  తగ్గించడంపైనే ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. అత్యుత్తమ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా.. అని ట్వీట్ చేసిన మస్క్.. మరో ట్వీట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం తెలియజేస్తానని పేర్కొన్నాడు.

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending