కార్వీకి భారీ షాక్.. రూ.700 కోట్ల షేర్లను ఫ్రీజ్ చేసిన ఈడీ.. అసలు కథేంటంటే..

2021-09-25 17:57:46 By VANI

img

రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.పార్థసారథికి ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. కార్వీకి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్లను ఈడీ శనివారం ఫ్రీజ్‌ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల షేర్లను సైతం ఫ్రీజ్‌ చేసింది.  రోజురోజుకూ పార్థసారధి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్‌ చేసింది.

 

అసలు కథేంటంటే..

 

ఇటీవల కార్వీలో భారీ కుంభకోణం వెలుగులోకి  వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని వాటిని షెల్‌ కంపెనీలకు కార్వీ మళ్లించింది. దీంతో భారీగా మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ వద్ద ఉన్న షేర్లను తనఖా పెట్టి లోన్లు తీసుకుని తర్వాత అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేశారని.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి తీగ లాగితే డొంకంతా కదలి వచ్చింది. 

 

 

మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్‌ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్‌‌లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్నీని దుర్వినియోగం చేసి పార్థసారథి తదితరులు భారీ స్కామ్‌కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్‌ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. 


Enforcement Directorate  Karvy  Parthasarathy  HDFC Bank  IndusInd Bank  CCS Police

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending