భలే క్లిక్ అయిందే..! ఏడాదిలో 300శాతం, ఇంట్రాడేలో 20% జంప్ చేసిన ఈక్లర్క్స్ షేరు! రీజన్ ఉంది గురూ..!

2021-06-11 12:27:28 By Anveshi

img

క్యు4లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఈక్లర్క్స  సర్వీస్ షేరు 20శాతం అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది.ఎర్లీ ట్రేడ్‌లోనే 20శాతం పెరగడంతో షేర్లుకు రూ.1617.35ధర వద్ద అప్పర్ సీల్ పడింది. బిపిఓ రిలేటెడ్ సర్వీసులు అందించే ఈ సంస్థ క్యు4లో 98.75కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది లాభంతో పోల్చితే ఇది 78శాతం ఎక్కువ. గత ఏడాది క్యు4లో ఈక్లర్క్స్ సర్వీసెస్ కంపెనీ రూ.55.40కోట్ల లాభం ఆర్జించింది

 

మొత్తంగా క్యు4లో ఈక్లర్క్స్ సంస్థ అమ్మకాల్లో 34.73శాతం వృద్ధి నమోదు అయి రూ.472.82 కోట్ల ఆదాయం గడించగా, 2020 మార్చి త్రైమాసికంలో రూ.350.93కోట్ల ఆదాయం ఆర్జించింది.

 

గత ఏడాదికాలంగా సంస్థ షేర్లు 300శాతం పెరిగాయి. జూన్ 12, 2020న రూ.391.50 ఉన్న ఈక్లర్క్స్ షేర్లు ఇప్పుడు రూ.1617కిపైగా ఎగయడం విశేషం.మొత్తం 2021 ఆర్థిక సంవత్సరానికి ఈక్లర్క్స్ సర్వీసెస్ కంపెనీ 282.56 కోట్ల లాభం ప్రకటించింది. ఇది 2020 ఆర్ధిక సంవత్సరంలో 208.98కోట్లుగా నమోదు అయింది


eclerx bpo data management it services uc telugu profit

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending