పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు.. అక్టోబర్‌లో 3 షాపింగ్‌ ఫెస్టివల్స్ స్టార్ట్‌.. 

2021-09-25 10:35:25 By VANI

img

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో కొంతైతే ఈ-కామర్స్‌ సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి వచ్చేయడంతో ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు పండుగ సీజన్‌ను టార్గెట్ చేశాయి. వినియోగదారుల ఇంట పండగ కళ తెచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. అక్టోబరు మొదటి వారంలో ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తంగా మూడు షాపింగ్‌ ఫెస్టివల్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. 

 

ఆఫర్లలో భాగంగా... ఎలక్ట్రానిక్ వస్తువులైన.. మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీలు, ట్యాబ్లెట్ పీసీలు వంటి వాటిపై అమెజాన్‌ భారీ తగ్గింపును ఇవ్వనుంది. 4 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’, 3వ తేదీ నుంచి మింత్రా ‘బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌’ ప్రారంభించనున్నట్టు ప్రకటించాయి. మరోపక్క ఫ్లిప్‌కార్ట్‌ ‘ద బిగ్‌ బిలియన్‌ డేస్‌’ విక్రయాలు అక్టోబరు 7 నుంచి 12వరకు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 

 

మరో బంపర్ ఆఫర్ ఏంటంటే.. శాంసంగ్‌, సోనీ, ఆపిల్‌, ఆసుస్‌, ఫాజిల్‌, వన్‌ప్లస్‌, హెచ్‌పీ, లెనోవో, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను ఈ సేల్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ విక్రయాలు సుమారు నెల రోజుల పాటు జరుగుతాయి. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ అనుబంధ సంస్థ మింత్రా అక్టోబరు 3 నుంచి 10 వరకు బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఈ మూడు సంస్థలు భారీగా కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.


E Commerce Firms  Amazon  Flipcart  Minthra  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending