భారతి ఎయిర్‌టెల్‌తో డీల్‌తో డిక్సన్ స్టాక్‌లో కదలిక ! టెలికాం ప్రొడక్ట్స్ కోసం జాయింట్ వెంచర్ !

2021-04-07 13:31:51 By Anveshi

img

టెలికాం ప్రొడక్స్ట్ తయారు చేసేందుకు భారతి ఎంటర్‌ప్రైజెస్‌తో డిక్సన్ టెక్నాలజీస్ డీల్ సెట్ చేసుకుంది. ఇందుకోసం
ఓ జాయింట్ వెంచర్ చేపట్టేందుకు మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌-ఎంఓయూ కుదిరిందని ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లలో డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు ఒకటిన్నరశాతం వరకూ పెరిగి రూ.3545 ధరని టచ్ చేశాయ్. 

ఈ ఒప్పందం ప్రకారం డిక్సన్ టెక్నాలజీస్ టెలికాం, మోడెమ్, రూటర్లు,సెట్ టాప్ బాక్సులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు వంటివి తయారు చేసి ఇస్తుంది. ఇండస్ట్రీ అవసరాల కోసమే ఈ జాయింట్ వెంచర్ అని చెప్తున్నప్పటికీ, భారతి ఎయిర్‌టెల్‌ ఒక్కటే  ఈ జాయింట్ వెంచర్ తాలుకూ కస్టమర్లలో ప్రధానంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం.  జాయింట్ వెంచర్‌లో డిక్సన్ టెక్నాలజీస్‌కి 74శాతం భారతి  ఎంటర్‌ప్రైజెస్‌కి 26శాతం వాటా ఉంటుందని తెలుస్తోంది

భారతి ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి డిక్సన్‌కే చెందిన డిక్సన్ ఎలక్ట్రో అప్లయన్సెస్ కానీ ఇంకేదైనా నోడల్ ఏజెన్సీ రూపంలో కానీ ఈ జాయింట్ వెంచర్ ఉండబోతోంది. అంతేకాదు ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని అందిపుచ్చుకునేందుకు కూడా ఈ భాగస్వామ్య సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కి ధరఖాస్తు చేయబోతున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ ప్రకటించింది. దీంతో అటు ఎయిర్‌టెల్‌కి అవసరమైన 5జి నెట్‌వర్క్ పరికరాలను, హార్డ్‌వేర్‌ని కూడా డిక్సన్ టెక్నాలజీస్ తయారు చేసే ఇస్తుందనే  అంచనాలు నెలకొన్నాయ్. ఇదే జరిగితే జియోకి 5జి నెట్‌వర్క్ విషయంలో ఎయిర్‌టెల్ సవాలు విసిరినట్లే..!

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending