బుల్స్ బేర్స్ టగ్ ఆఫ్ వార్ ! సందట్లో సడేమియాలాగా DIIల గేమ్ ప్లాన్..!

2021-05-01 13:24:08 By Anveshi

img

గత వారం మార్కెట్లలో బుల్స్ వర్సెస్ బేర్స్ గేమ్‌లో బుల్స్ అప్పర్ హ్యాండ్ సాధించారు. ఐతే అంతర్లీనంగా ఇంకొంతమంది
ఈ ఆట నుంచి మేగ్జిమమ్ ప్రాఫిట్ పొందేందుకు ప్రయత్నించారు. బెంచ్ మార్క్ ఇండెసిస్ వారం మొత్తం మీద 2 శాతం లాభపడగా దేశీయ సంస్థాగత మదుపరులు ఈ ఆటలో లాభం పొందారు. నెల మొత్తం మీద DII( దేశీయ సంస్థాగత మదుపరులు)లు రూ.9900 కోట్లు మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. అంటే ఫారిన్ ఇన్సిట్యూషనల్, పార్టిసిపేషన్ ప్లేయర్లు వెనక్కి తగ్గుతున్నట్లు కన్పించగానే, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లపై నమ్మకం ఉంచినట్లు క్లియర్‌గా అర్ధమవుతోంది

 

గత 6 నెలలుగా మన మార్కెట్లలో నిధులు పారించిన ఎప్ఐఐ,ఎఫ్‌పిఐలు ఏప్రిల్ నుంచి వెనక్కి తగ్గడం కన్పించింది. ఈ నెలలో రూ.8500కోట్ల మేర స్టాక్స్ విక్రయించారు. ఐతే డిఐఐలు 9900కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో, మన ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఢోకా లేకుండాపోయింది. అంటే  బుల్స్ రంకెలు పెట్టినా, బేర్స్  గుక్కపట్టినా సరే పరిస్థితిని తమకి అనుకూలంగా  మార్చుకునేలా డిఐఐలు వ్యూహం పన్ని దాని ప్రకారం కొనుగోళ్లకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు డాలర్-రూపాయి మారకం రూ.75.5 నుంచి రూ.74 మధ్యలో మారకపు విలువ నిలకడగా ఉండటంతో ఎఫ్‌పిఐలు కూడా నెట్ బయ్యర్లుగా మారారు.

 

మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాదు బాండ్ల ఈల్డ్, బాండ్ల కొనుగోలు కార్యక్రమం  కొనసాగుతుందని కూడా అక్కడి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో అక్కడి సెంటిమెంట్‌కి ఢోకా లేదనేది  సుస్పష్టమైంది. ఇదే ప్రభావం మన మార్కెట్లకు కూడా సానుకూలంగా ప్రతిబింబించి, కరోనా సెకండ్ వేవ్ ఉన్నా కూడా మార్కెట్లలో జోరు కొనసాగింది


FII FPI DII NET BUYERS SELLERS APRIL MONTH 9900 CRORES RUPEES INVESTMENTS EQUITY MARKET TELUGU PROFIT TRADE TELUGU US BOND FOEC

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending