అసలు కంటే కొసరే ముద్దు ! క్యు4 కెనరా బ్యాంక్ నెట్ ఇంట్రస్ట్ కెవ్వు కేక..! రూ.1011కోట్ల లాభం

2021-05-18 20:40:43 By Anveshi

img

Q4లో అంచనాలను తలకిందులు చేసిన కెనరా బ్యాంక్

స్టాండలోన్ ప్రాఫిట్ రూ.1010.87కోట్లుగా నమోదు
వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం దన్నుతో దున్నేసిన కెనరా బ్యాంక్

 

దేశంలోనే నాలుగో అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ లెండర్, కెనరా బ్యాంక్ 2021 నాలుగో త్రైమాసికపు ఫలితాలు అంచనాలను మించిపోయాయ్. క్యు4లో స్టాండలోన్ లాభం రూ.1010.87కోట్లుగా నమోదు చేయగా, నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్‌లో 68శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది.

 

గత ఏడాది ఇదే గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.3259.3కోట్ల నష్టం ప్రకటించగా, ఇతర రూపంలో వచ్చిన ఆదాయం దాదాపు రెట్టింపు నమోదు అయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.2175కోట్ల నుంచి రూ.5207కోట్లకి పెరగగా, ఈ ఫలితాలను పూర్తిగా గత క్వార్టర్లతో పోల్చి చూడలేం. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం గత  సంవత్సరం ఏప్రిల్ నుంచి లెక్కగడుతున్నారు. 

 

ఇదే సమయంలో గ్లోబల్ బిజినెస్ లో 8.23శాతం పెరిగి రూ.16,86,030కోట్లుగా నమోదు అయినట్లు బ్యాంక్ ప్రకటించింది. గ్లోబల్ డిపాజిట్లు 11.5శాతం పెరిగి ఏటికేడాది ప్రాతిపదికన రూ.10,10,875కోట్లకి చేరిన డిపాజిట్లకి చేరాయి.

 

మంగళవారం మార్కెట్లలో కెనరా బ్యాంక్ షేర్లు 4.20శాతం నష్టపోయి రూ.147.05వద్ద ముగిశాయి.
 


canara bank results q4 telugu profit trade rise nim nii net interest income revenue

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending