బిట్ కాయన్ ధరకు ముకుతాడు పడిందా

2021-01-22 09:18:17 By Y Kalyani

img

బిట్ కాయన్ ధరకు ముకుతాడు పడిందా
ఇంకా తగ్గుతుందా.. మళ్లీ పెరుగుతుందా 

గత కొద్దిరోజులుగా ఏమాత్రం బ్రేకుల్లేకుండా దూసకపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయన్ కు ముకుతాడు పడింది. వరసగా రెండు రోజులుగా దీని వాల్యూ తగ్గుతూ వస్తుంది. గురువారం బిట్ కాయన్ ప్రైస్ 29327వేల డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే గడిచిన మూడు వారాల్లో ఇంత తక్కువ ధరకు రావడం ఇదే మొదటిసారి. ఈ నెల తొలివారంలో ఏకంగా బిట్ కాయన్ ధర 41వేలకు పెరిగింది. దూకుడు కంటిన్యూ అవుతుందని.. 50వేల డాలర్లు కూడా దాటుతుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ముకుతాడు పడింది. మళ్లీ దిగి వస్తుంది. 
ఏడాదిలో 900శాతం..
బిట్ కాయన్ ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గత ఏడాది 2020 మార్చి నుంచి ఎగబాకుతూ వచ్చింది. 900 శాతం పెరిగిపోయింది. జనవరి మొదటివారంలో 41వల డాలర్లకు చేరింది. కానీ వారంలో మళ్లీ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం 29327 వేల డాలర్లకు చేరుకుంది. అయితే.. పెద్దగా  ప్రభావం ఏమీ చూపదని మళ్లీపెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. కరెక్షన్ అంటున్నారు ఇంకొందరు. మొత్తానికి ప్రపంచ మార్కెట్లలో సంస్థాగత ఇన్వెస్టర్ల ద్రుష్టిని ఆకట్టుకుని ధరలు పైపైకి పోయిన బిట్ కాయన్ ప్రైస్ ఇంకా పెరుగుతుందా.. తగ్గుతుందా చూడాలి.

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending