వొడాఫోన్‌కు ఆసరా దొరికినట్టే... చేయూతనిచ్చేందుకు సిద్ధమైన బిర్లా..

2021-08-02 17:58:51 By VANI

img

వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఒకరకంగా మునిగే నావ. ఎవరో ఒకరు చేయూతనిచ్చి లేపితే తప్ప చాలా కష్టం. చుట్టూ ఆర్థిక ఇబ్బందులు.. ఆపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన చెల్లింపులు మూలిగే నక్కపై తాటిపండు పడిన మాదిరిగా తయారైంది పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి వొడాఫోన్‌ను గట్టెక్కించేందుకు విల్ ప్రమోటర్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ముందడుగు వేశారు. ఏదైనా ప్రభుత్వ యాజమాన్యంలోని లేదంటే దేశీయ ఆర్థిక సంస్థకు వొడాఫోన్‌లోని తన వాటాను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రభుత్వానికి వెల్లడించారు.

 

జూన్ 7 న యూనియన్ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో ఈ సూచనలు చేశారు. దీని బోర్డు గత సెప్టెంబర్‌లో రూ. 25,000 కోట్లు సమీకరించే ప్రణాళికను ప్రకటించింది కానీ ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. విల్‌లో బిర్లా 27 శాతానికి పైగా వాటాను కలిగి ఉండగా, వొడాఫోన్ Plc 44 శాతానికి పైగా కలిగి ఉంది. విల్ యొక్క  మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,000 కోట్లకు పైగా ఉంది. ఇద్దరు ప్రమోటర్లు కంపెనీలో తాజా నిధులను ఇన్ఫ్యూజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. Vodafone Plc తన పెట్టుబడి మొత్తాన్ని ఇప్పటికే రద్దు చేసింది.

 

గత నెలలో సుప్రీంకోర్టు విల్, భారతి ఎయిర్‌టెల్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఏజీఆర్‌ను లెక్కించడంలో తప్పులను సరిదిద్దాలని కోరింది. 7800 కోట్ల చెల్లింపు చేసిన తర్వాత VIL దాని మిగిలిన ఏజీఆర్ బకాయిలను దాదాపు రూ. 21,500 కోట్లుగా లెక్కించింది. మొత్తమ్మీద టెలికమ్యూనికేషన్ల విభాగం కంపెనీ మొత్తం AGR బాధ్యత రూ .58,000 కోట్లుగా నిర్ధారించింది.
 


Kumar Mangalam Birla Vodafone India Limited

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending