డిసెంబర్ త్రైమాసికంలో జెనరిక్ వ్యాపారంలో లాభాలు అంచనాలకు అనుగుణంగా రాకపోవడంతో ఇవాళ బయోకాన్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. దీంతో ఇవాళ బయోకాన్ ఇంట్రాడేలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఇంట్రాడేలో షేర్ దాదాపు 5శాతం నష్టపోయి డే కనిష్ట స్థాయి రూ.377.65కు పడిపోయింది. ప్రస్తుతం ఒకశాతం నష్టంతో రూ.390.55 వద్ద షేర్ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో 77.05 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.
మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో బయోకాన్ రేటింగ్‌ను తగ్గించింది రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ. కంపెనీ టార్గెట్ ధరను రూ.260 నుంచి రూ.240కు తగ్గించింది ఈ సంస్థ. అలాగే FY21-23లో బయోకాన్ EPS 8-12గా నమోదు కావచ్చని సీఎల్ఎస్ఏ అంచనా వేస్తోంది.
ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 18శాతం క్షీణించి రూ.186.6 కోట్లుగా నమోదైంది. కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 7.20 శాతం వృద్ధితో రూ.1878.9 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.1752.6 కోట్లుగా నమోదైంది. కంపెనీ జెనరిక్స్ వ్యాపారం 3శాతం క్షీణతతో రూ.576 కోట్ల నుంచి రూ.561 కోట్లకు పడిపోయింది.
కంపెనీ ఏమంటుందంటే?
గత ఏడాది మాకు ఎంతో సవాలుతో కూడిన సంవత్సరం. ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో సతమతం అయింది. ప్రపంచ ఎకానమీ డీలాపడింది. మార్కెట్ విస్తరణకు ప్రతిబంధకంగా ఉన్న కార్యాచరణ, నియంత్రణ; వాణజ్య కార్యకలాపాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయినప్పటికీ డిసెంబర్ త్రైమాసికంలో చక్కని ఫలితాలను ప్రకటించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తిరిగి పుంజుకుంటాం. అని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు.