పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన బిగ్ సి.. ఆఫర్ల వెల్లువ

2021-10-13 10:08:37 By VANI

img

పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు బిగ్‌ సి కూడా సిద్ధమైంది. దసరా, దీపావళిని బేస్ చేసుకుని బిగ్‌ సి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలపై ఆఫర్లు ప్రకటించింది. ప్రతిసారి లాగే ఈ సారి కూడా వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించామని బిగ్‌ సి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. మొబైల్‌ కొనుగోలుపై 10 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌, వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండా సులభ వాయిదాల్లో మొబైల్‌ కొనుగోలు చేసే సౌకర్యాన్ని బిగ్‌సి కల్పించింది. అంతేకాకుండా ప్రతి మొబైల్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు. 

 

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల కోసం బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అమెజాన్‌ పే, పేటీఎం మాల్‌ తదితరాలతో బిగ్‌ సి చేతులు కలిపింది. ఈ క్రమంలోనే మొబైల్‌ కొనుగోళ్లపై బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా రూ.3500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులతో రూ.1500 వరకు, అమెజాన్‌ పేతో రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  సామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉందని బాలు చౌదరి అన్నారు. వన్‌ప్లస్‌ ఫోన్లపై రూ.7,000 వరకూ, ఎంఐ ఫోన్లపై రూ.3,000 వరకూ, వివో ఫోన్లపై 10 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నారు. 

 

మొబైల్‌ ఫోన్లతో పాటు స్మార్ట్‌ టీవీలపై కూడా బిగ్‌ సి రూ.4,500 వరకూ క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. ఆఫర్లను వినియోగించుకోవాలని బిగ్‌ సి బ్రాండ్‌ అంబాసిడర్‌ హీరో మహేశ్‌ బాబు కోరారు. పేటీఎం ద్వారా ఓపో మొబైల్‌ కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఐఫోన్‌లపై రూ.6000 వరకు, శామ్‌సంగ్‌ మొబైళ్లపై రూ.10000 వరకు క్యాష్‌బ్యాక్‌, వన్‌ప్లస్‌ మొబైళ్లపై రూ.7000 వరకు రాయితీ, ఎంఐ మొబైళ్లపై రూ.3000 వరకు, వివో మొబైళ్లపై 10 శాతం, ఓపో మొబైళ్లపై రూ.4000 వరకు, స్మార్ట్‌టీవీలపై రూ.4500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నామని బాలు చౌదరి తెలిపారు.


Bajaj Finance  ICICI Bank  Amezon Pay  Paytm  Samsung  One Plus  MI Phones  Vivo phones  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending