తమ అనుబంధ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపుతో ఇవాళ భారతీ ఎయిర్టెల్ దూసుకుపోతోంది. ఇంట్రాడేలో షేర్ 6శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.601.70కు చేరింది. గత ఏడాది మే 20న నమోదైన 52వారాల గరిష్ట స్థాయి రూ.612కు తాకేలా కనిపించింది. ప్రస్తుతం 5.5శాతం పైగా లాభంతో రూ.597.05 వద్ద షేర్ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో దాదాపు 3.50 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,21,877 కోట్లకు చేరింది. గత 2 రోజులుగా భారతీ ఎయిర్టెల్ 10 శాతం పైగా లాభపడింది.
100శాతం ఎఫ్‌డీఐకి లైన్ క్లియర్..
భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు దాని అనుబంధ సంస్థల్లో 100శాతం విదేశీ పెట్టుబడులకు లైన్‌క్లియర్ అయింది. తాజాగా రెగ్యులేటరీ నుంచి దీనికి సంబంధించి అన్ని అనుమతులు సంపాదించినట్టు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిమితిని సవరించిన తరువాత MSCIలో దాని వెయిటేజీ పెరగనుండటంతో ఈ స్టాక్‌లో గణనీయంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది.