బజాజ్ ఎలక్ట్రికల్స్ ఆదాయ వృద్ధి అంచనాలను మించడంతో ఇవాళ ఈ స్టాక్ జోరుమీదుంది. ఇంట్రాడేలో షేర్ 17 శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.833.95కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం విశేషం. ప్రస్తుతం 9.50శాతం పైగా లాభంతో ఈ స్టాక్ రూ.781.95 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో 17.10 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,950 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాదిలో బజాజ్ ఎలక్ట్రికల్ చక్కని రిటర్న్స్ అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్ 37 శాతం పైగా లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. కంపెనీ లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ రేటింగ్‌ను ఇక్రా స్థిరంగా కొనసాగించడం ఈ స్టాక్ సెంటిమెంట్‌ను బలపర్చింది. అలాగే ఎన్సీడీ రేటింగ్‌ను నెగిటివ్ నుంచి స్టేబుల్‌కు ఇక్రా సవరించింది.