భారీగా తగ్గిన వాహన రిజిస్ట్రేషన్స్‌, అసలు కారణం ఇదే..!

2021-04-08 10:36:52 By Marepally Krishna

img

గత నెల్లో వాహన రిజిస్ట్రేషన్స్‌ భారీగా తగ్గాయని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైలత్‌ డీలర్స్ అసోసియేషన్‌ (FADA) తన తాజా నివేదికలో ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్స్‌ 28.64శాతం క్షీణత నమోదైంది. అలాగే ఫిబ్రవరితో పోలిస్తే ఇది 10.05శాతం తక్కువ. గత ఏడాది కొవిడ్‌-19 ప్యాండమిక్‌, లాక్‌ డౌన్‌తో మార్చి చివరి వారంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. లేకుండా గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్స్‌లో భారీ క్షీణత నమోదయ్యేదని FADA తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

 


గత ఏడాది బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు వెహికిల్‌ మార్చడానికి రిజిస్ట్రేషన్‌ గడువు ఉండటంతో 2020 మార్చిలో భారీగా రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. పోస్ట్‌ కొవిడ్‌ తర్వాత కూడా రిజిస్ట్రేసన్లు భారీగా పెరిగాయి. దీనికితోడు పోస్ట్‌కోవిడ్‌తో చాలామంది స్వంత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపడం కూడా ఇండస్ట్రీకి బూస్టింగ్‌నిచ్చింది. అయితే ఇన్‌పుట్‌ కాస్ట్‌ భారీగా ఈ ఏడాది వాహన కంపెనీలు ఇప్పటికే రెండుసార్లు ధరలను పెంచాయి. దీంతో వాహన అమ్మకాలు గతంతో పోలిస్తే కొంచెం నెమ్మదించాయి. 

 

ఇక మార్చిలో కమర్షియల్‌ వెహికిల్స్‌ రిజిస్ట్రేషన్స్‌లో 42.20శాతం, ద్విచక్రవాహనాల్లో 35.26శాతం, త్రిచక్ర వాహనాల్లో 50.72శాతం క్షీణత నమోదైంది. ట్రాక్టర్స్‌ విషయానికి వస్తే గత నెల్లో చక్కని సేల్స్‌ నమోదుకావడంతో పాటు రిజిస్ట్రేషన్స్‌ కూడా పెరిగాయి. ట్రాక్టర్స్‌ రిజిస్ట్రేషన్స్‌ 29.2శాతం వృద్ధితో 53463 యూనిట్ల నుంచి 69082 యూనిట్లకు పెరిగాయి. 
 

Tractors and passenger vehicles sustained healthy momentum by growing 29.21 percent and 28.39 percent YoY, respectively. (Image Source: Shutterstock)

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending