ఆటో కంపెనీలకు మళ్లీ షాకింగ్ న్యూస్.. తగ్గుతున్న లాభాలు

2021-07-27 22:57:14 By Y Kalyani

img

ఆటో కంపెనీలకు మళ్లీ షాకింగ్ న్యూస్.. తగ్గుతున్న లాభాలు

ఆటో రంగానికి సినిమా కష్టాలు తప్పడం లేదు. గడిచిన కొద్దినెలలుగా నష్టాల్లో ఉన్న సంస్థలకు పిడుగులాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కోవిడ్ కారణంగా అమ్మకాలు పడిపోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థలకు పెరుగుతున్న మెటీరియల్ ధరలు మరింత నష్టాల పాలు చేస్తున్నాయి. పేండమిక్ నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ధరాభారం కంపెనీలకు శాపంగా మారింది. దీంతో కంపెనీలు కస్టమర్లపై భారం వేయడానికి రెడీ అవుతున్నాయి. గడిచిన కొద్ది నెలల్లోనే రెండుసార్లు ధరలు పెంచిన వాహనాల కంపెనీలు మళ్లీ ముచ్చటగా మూడోసారి ధరలు పెంచనున్నాయి. స్కూటర్ల నుంచి హెవీ ట్రక్స్ దాకా అన్ని ధరలు పెరగనున్నాయి.
ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలు 2.5శాతం వరకూ పెంచింది. జులైలో మళ్లీ 1 నుంచి 2.5శాతం వరకూ పెంచారు. అంతకుముందు మేలోకూడా 1.8శాతం పెంచారు. అటు మారుతీ సుజుకీ కంపెనీ కూడా జులై, సెప్టెంబరు త్రైమాసికంలో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. టూవీలర్ కంపెనీ బజాజ్ అయితే అన్ని రకాల మోడల్స్ పైనా 5శాతం వరకూ పెంచింది. ఇవే కాదు.. మేజర్ ఆటో కంపెనీలు అన్నీ కూడా ధరలు పెంచుతున్నాయి. 

ఆదాయాలపై ప్రభావం..
అమ్మకాలు పెంచుకునే సమయంలో ధరలు పెంచడం మార్కెటింగ్ కష్టాలు పెంచుతుంది కానీ అనివార్యంగా పెంచాల్సి వస్తుందని కంపెనీలంటున్నాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. ఆదాయం పడిపోతోంది. వాహనాల్లో అత్యంత కీలకమైనది స్టీల్.. గడిచిన 9 నెలల్లో 50శాతం వరకూ పెరిగింది. దీంతో పాటు టైర్లు, బ్యాటరీల వంటి ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో కార్ల ధరలు కూడా పెంచాల్సి వస్తుందని అంటున్నారు. ఆదాయం పడిపోతే.. కంపెనీలపై అప్పుల భారం పెరుగుతుందని.. అంతిమంగా నష్టాలు తప్పవని అంటున్నారు. 


auto auto sales market profit trading auto sector

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending