లాభాల అస్ట్ర..! పైప్‌లైన్‌లో రెజినోవా బిజినెస్ ! రూ.2వేలకి దగ్గరైన షేరు ధర

2021-06-10 11:50:09 By Anveshi

img

అస్ట్రల్ పైప్ లైన్స్ షేరు ధర గురువారం 2శాతానికిపైగా పెరిగింది. దీంతో కొత్త గరిష్టమైన రూ.1990కి ఎగయడంతో ఈ కౌంటర్‌లో
లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. ఎప్పుడూ స్తబ్దుగా కన్పించే ఈ కౌంటర్ గత నాలుగు రోజుల్లో ఐదుశాతం పెరగడమే ఇందుకు దోహదపడుతోంది

 

అడ్‌హెసివ్ కెమికల్ వ్యాపారం చేసే రెజినోవా సంస్థని విలీనం చేసుకోవడానికి బోర్డు అనుమతించడంతోనే ఈ కౌంటర్‌లో ఇలా ర్యాలీ చోటు చేసుకుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రెజినోవా కెమీ, ఆస్ట్రల్ బయోకెమ్ ప్రవేట్ ఈ రెండు కంపెనీలను అస్ట్రల్‌లో విలీనం చేయబోతున్నారు

 

గత నెల రోజులుగానే అస్ట్రల్ షేరు ధర 27శాతం పెరిగింది. ప్రస్తుతం విలీనంతో రెండు సంస్థల మధ్యా క్రాసోవర్ సెల్లింగ్ వ్యాపారం పెరుగుతుంది. అలానే రవాణా పరంగా కూడా చాలావరకు ఖర్చులు మిగులుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అస్ట్రల్ పివిసి, సిపివిసి పైప్ లైన్ల తయారీ వ్యాపారంలో ఉండగా, రెజినోవా పుట్టీస్, సానిటైజర్స్, సర్ఫేస్ క్లీనర్స్ డిసినిఫెక్టెంట్, అడ్‌హెసివ్( జిగురుకు సంబంధించిన) వ్యాపారంలో ఉంది

 

ప్రస్తుతం అస్ట్రల్ షేర్లు అరశాతానికిపైగా పెరిగి రూ.1955.50 వద్ద ట్రేడ్ అయ్యాయ్
 


astral pipes resino chemi merger telugu profit

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending