మనుషులే అనుకుంటే చీమలూ అలాగే తయారయ్యాయ్.. వాడుకుని వదిలేశాయ్.. ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూస్..

2021-10-23 12:00:34 By VANI

img

చీమలు మనకెన్నో విషయాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయ్. ఎక్కడికి వెళ్లినా.. కలిసికట్టుగా వెళ్లడం.. ఫుడ్ తెచ్చుకుని పొదుపు చేసుకోవడం.. బద్దకం అంటే ఏంటో కూడా తెలియకపోవడం.. విరామమెరుగక పని చేయడం అన్నీ చీమలు మనకు నేర్పుతాయి. ‘బలవంతమైన సర్పం.. చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ’ అంటూ బద్దెన చెప్పారు. అంటే అల్ప ప్రాణులైన అవి కలిసికట్టుగా మహా సర్పాన్ని సైతం చంపేయగలుగుతాయి. అయితే మనం చీమలను గమనిస్తున్నట్టుగానే.. చీమలు కూడా మనల్ని గమనిస్తాయేమో అని కొన్ని సార్లు. ఆ డౌట్ ఎందుకొచ్చిందే. తాజాగా ఒక వ్యక్తి మూడు చీమలకు సంబంధించిన ఓ 16 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన వారికెవరికైనా ఆ సందేహం రాకమానదు.

 

ఆరు నెలల సావాసం చేస్తేనే వారు.. వీరైతే.. కొన్ని శతాబ్దాలుగా చీమలు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మీరు మన బుద్దులు కాస్తో కూస్తో వాటికి అబ్బకుండా ఉంటాయా.. యేంటి? అన్నట్టుగా ఉందా వీడియో. బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఐదు మిలియన్ల మందికి పైగా చూశారు. ఇక దీనిపై కామెంట్లు, సెటైర్స్‌కు ఏమాత్రం కొదువ లేదు. 

 

ఆ వీడియోలో ఏముందంటే..

 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. మూడు చీమలు ఒక ఇనుప రాడ్‌పై నుంచి దానిపైనున్న రాడ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆ ఆకు కాస్త ఎత్తులో ఉండటంతో చివరకు ఒక చీమ తాను నిలబడి.. తన మీదుగా రెండు చీమలను ఆకుపైకి ఎక్కించేసింది. ఆ తరువాత ఆ రెండు చీమలు తమను ఆకుపైకి ఎక్కించిన చీమకు ధన్యవాదాలు చెప్పడం మాట అటుంచితే.. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్లిపోయాయి. కింద నుంచి చీమ సాయం కోసం పైకి అలాగే చూస్తూ ఉండిపోయింది.

 

ఈ వీడియోను చూసిన వాళ్లంతా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ చీమ ఎంతగా బాధపడేదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల నుంచి చీమలు కూడా నేర్చుకుంటున్నాయని.. అవి కూడా వాడుకుని వదిలేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. అవసరం తీరాక మనిషైనా, ఇతర జీవులైనా ఒకటేనని ఈ వీడియో నిరూపించిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో నైతికతతో పాటు.. భావాల సంగతిని పక్కనపెడితే ఎన్నో పాఠాలు, గుణపాఠాలను నేర్పుతోందనడంలో సందేహం లేదు. 


Ants  human 

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending