అలంకిత్ ట్రేడర్ల పుట్టి మునుగుతుందా..? పులకిస్తారా..? 9లక్షల షేర్లు విక్రయించిన ప్రమోటర్

2021-09-24 09:32:52 By Anveshi

img

గత ఐదారేళ్లుగా ప్యూర్‌గా ఇన్‌సైడ్ ట్రేడింగ్ తప్ప బయట పెద్ద వ్యాపారం జరగని కౌంటర్లలో అలంకిత్
కూడా ఒకటి. అసలీ కౌంటర్ పేరు కూడా వినని వాళ్లు లక్షల్లో ఉంటారు. ఒకరిద్దరు అనలిస్టులు పనిగట్టుకుని మరీ ప్రచారం చేయడం తప్ప ఈ కౌంటర్‌లో పెద్దగా పస కూడా ఉండదు. ఐతే ఇవాళ  ఈ సంస్థకి చెందిన ప్రమోటర్ అలంకిత్ అసైన్ మెంట్స్ 9లక్షల28వేల 445 షేర్లను ఎన్ఎస్ఈలో  బల్క్ డీల్‌ ద్వారా విక్రయించారనే విషయం బైటపడింది.

 

ఒక్కో షేరుకు పడిన విక్రయ ధర రూ.15.55

 

ఈ బల్క్ డీల్ తర్వాత అలంకిత్ షేరు ఇంట్రాడేలో రూ.16.15 వరకూ వెళ్లినట్లు రికార్డైంది తప్ప వాస్తవంగా ట్రేడ్ అయిన ధర రూ.15.85 మాత్రమే.  

 

ఆధార్ డేటా మేనేజ్ మెంట్ సెంటర్లకు టెక్నికల్ అసిస్టెన్స్ ను ఈ సంస్థ ఇస్తున్నట్లు అక్కడక్కడా కన్పిస్తుంది తప్ప వాస్తవ వ్యాపారం ఏంటో తెలియదు. ప్రస్తుతం రూ.15.85 వద్ద ఈ షేర్లు ట్రేడ్ అయ్యాయ్


alankit trade assignment shares buy promoter

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending