-->

జోరుమీదున్న అదాని గ్రీన్‌ ఎనర్జీ

2021-01-14 11:28:05

img

అదానీ ట్రేడింగ్‌ సర్వీసెస్‌లో వాటా విక్రయించడంతో ఇవాళ అదాని గ్రీన్‌ ఎనర్జీ ఇవాళ జోరుమీదుంది. ఇంట్రాడేలో షేర్‌ 5శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.967.45కు చేరింది. ప్రస్తుతం మూడున్నర శాతం లాభంతో రూ.954.70 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 10.02 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.50 లక్షల కోట్లకు చేరింది.


రూ.1840 కోట్ల షేర్లు విక్రయించిన అదానీ గ్రూప్

అదానీ ట్రేడింగ్ సర్వీసెస్ తన కంపెనీలో రూ.1840 కోట్ల విలువైన షేర్లు విక్రయించింది.  అదానీ గ్రీన్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న ఈ కంపెనీలో 2 కోట్లకు పైగా షేర్లు విక్రయించింది. దీని విలువ 1840 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇదంతా ఓపెన్ మార్కెట్ బ్లాక్ డీల్ రూపంలో జరిగింది. సెప్టెంబర్ 2020 ప్రకారం అదానీ ట్రేడింగ్ సర్వీసెస్ కంపెనీలో అదానీగ్రీన్ సంస్థకు 33.92శాతం స్టేక్ ఉంది.