అదానీ గ్రీన్ అప్పరప్పర తాండ్ర..! వరసగా రెండో రోజూ అప్పర్ సర్క్యూట్

2021-05-18 10:55:30 By Anveshi

img

గత రెండు నెలల క్రితం మార్కెట్లలో తెగ హాట్ టాపిక్ అయిన అదానీ స్టాక్స్ జోరు మళ్లా ప్రారంభమైంది. నిన్న అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్‌గా 9శాతం వరకూ పెరగగా, ఇవాళ్టి మార్కెట్లలో అదానీ గ్రీన్ ఎనర్జీ 5% అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది. నిన్న కూడా ఈ స్టాక్  అప్పర్ సర్క్యూట్ లాక్ చేయడం గమనార్హం

 

SBఎనర్జీ హోల్డింగ్స్‌ను అదానీ గ్రూప్ టేకోవర్ చేయనుందనే వార్తలే ఇందుకు కారణం. ఇవాళ్టి మార్కెట్లలో రూ.1199.65కి ఎగసిన అదానీ గ్రీన్ ఎనర్జీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా డబుల్ కావడం విశేషం. ఉదయం పదిగంటలకే 7లక్షలకిపై చిలుకు షేర్లు చేతులు మారాయ్. అలానే మరో లక్షాపాతికవేల షేర్లు పెండింగ్‌లో ఉన్నాయ్. 

 

ఈ ఏడాది మార్చి 24న ఈ స్టాక్ రూ.1341.60 ఆల్ టైమ్ గరిష్టానికి చేరగా, అప్పట్నుంచి కిందిచూపులే తప్ప పైకి లేవలేదు. ఇప్పుడు తిరిగి మొమెంటమ్ కన్పిస్తోంది

ఎస్‌బి గ్రూప్‌‌లో  సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, భారతి ఎంటర్‌ప్రైజెస్ కలిపి వాటాలుండగా ఈ కొనుగోలు కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ 650 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చని అంచనా


ADANI SB GROUP RENEWABLE ENERGY SHARES TELUGU PROFIT TRADE

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending