పిఎల్ఐ స్కీమ్ కోసం క్యూ..! 

2021-05-04 20:26:34 By Anveshi

img


కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్  లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం మొబైల్ తయారీ కంపెనీలు క్యూ కట్టాయ్.ఐతే కేవలం మొబైల్ తయారీ రంగంలో కాదు, ఐటీ సంస్థలకు హార్డ్‌వేర్ యూనిట్లు
తయారు చేసామంటూ చెప్పుకొచ్చాయ్. ఇలా 19 కంపెనీలు ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసం ధరఖాస్తు చేసుకున్నాయ్. డెల్, హై-టెక్(ఫాక్స్‌కాన్),లావా, ఐసిటి, ఫ్లెక్స్‌ట్రానిక్స్

దేశీయంగా తయారీ కంపెనీల్లో డిక్సన్, ఇన్ఫోపవర్( సహస్ర-మిటాక్ భాగస్వామ్య సంస్థ) భగవతి( మైక్రోమ్యాక్స్),సిర్మా,  ఆర్బిక్, నియోలింక్, ఆప్టైమస్, నెట్‌వెబ్,వివిడిఎన్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, పనాచీ డిజిలైఫ్, హెచ్ఎల్‌బిఎస్,ఆర్‌డిపి వర్క్ స్టేషన్స్,కోకోనిక్స్ ఉన్నాయి.


ఈ 19 కంపెనీలు తమ ఉత్పత్తిని భారీగా పెంచడంతో పాటు నేషనల్ ఛాంపియన్లుగా ఐటి హార్డ్ వేర్ రంగంలో  ఎదుగుతాయని కేంద్రం చెప్తోంది. రాబోయే ఐటీ హార్డ్ వేర్ రంగంలో నాలుగేళ్లలో లక్ష60వేల కోట్ల ఉత్పత్తి 60వేల కోట్ల రూపాయల ఎగుమతి జరుగుతుందని కేంద్రం అంచనా

 

పిఎల్ఐ స్కీమ్ ప్రకారం ఈ కంపెనీల ఉత్పాదకతపై అమ్మకాలపై  నాలుగు నుంచి 2శాతం ఇన్సెంటివ్ ఇస్తారు. ఇది 2019-20 బేస్ ఇయర్‌గా తీసుకుని ఆయా కంపెనీలు ఎంత ఉత్పాదకత పెరిగితే అంతమేర ఆ అమ్మకాలపై ఈ 1,2,4శాతాలలో ఇన్సెంటివ్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది
 


pli.hardware.it.dell.dixon

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending