రివర్స్‌గేర్‌లో ఆటో సేల్స్‌, జూన్‌లో కోలుకునే ఛాన్స్‌

2021-06-10 10:58:34 By Marepally Krishna

img

నెమ్మదించిన వాహన విక్రయాలు

మేలో 55 శాతం క్షీణించిన వెహికిల్‌ సేల్స్‌

జూన్‌లో ఇండస్ట్రీ కోలుకునే అవకాశం

ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో ఆటో కంపెనీలకు ఊరట

భారీగా పెరిగిన ఆన్‌లైన్‌ ఎంక్వైరీలు


మే నెల్లో వెహికిల్‌ సేల్స్‌ భారీగా క్షీణించాయి. గత ఏడాది లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో మేనెల్లో లాక్‌డౌన్‌ ఉండటంతో ఏప్రిల్‌ గణాంకాలతో పోల్చి ఆటోసేల్స్‌ రిపోర్ట్‌ను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల్లో మొత్తం రిటైల్‌ వాహనాల విక్రయాలు దాదాపు 55శాతం పడిపోయాయి. 


వరుసగా రెండో ఏడాది మే నెల ఆటో కంపెనీలకు రక్తకన్నీరే మిగిల్చింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాహన రంగానికి లాక్‌డౌన్‌ నిర్ణయం మరింత కష్టాన్ని తెచ్చిపెట్టిందని  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తమ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. కోవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ తర్వాత కోలుకున్నట్లే కనిపించినప్పటికీ సెకండ్‌వేవ్‌ రూపంలో ఆటో రంగానికి ఊహించని కష్టం ఎదురైందని తెలిపింది. 


గత నెల మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్‌తో పోలిస్తే 52.5శాతం క్షీణతతో 4,10,757 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్యాసింజర్‌ వాహనాల సేల్స్‌ 59 శాతం క్షీణతతో 85,733 యూనిట్లకు పడిపోయాయి. ట్రాక్టర్‌ సేల్స్‌ 57శాతం, కమర్షియల్‌ వెహికిల్స్‌ 66శాతం తగ్గాయి. పోస్ట్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గత నెల్లో డిమాండ్‌ తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో సేల్స్‌ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. గత ఏడాది మాదిరిగానే జూన్‌లో సేల్స్‌ ఉంటాయని ఆటో ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. 

 

ఇక లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపుతో ఆటో సెక్టార్‌ ఈనెల తొలి 10 రోజులు అత్తుత్యమ అమ్మకాలను నమోదు చేశాయని  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం కావడంతో తిరిగి వాహన షోరూమ్‌లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్షంగా షోరూమ్‌లకు కస్టమర్లు తక్కువగా వస్తున్నప్పటికీ... ఆన్‌లైన్‌ ఎక్వైరీలు మాత్రం భారీగానే ఉన్నాయని షోరూమ్‌ నిర్వాహకులు తెలిపారు. దీంతో జూన్‌లో సేల్స్‌ జూమ్‌మనే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. 

June PV retail sales dip 4.6% on liquidity issues


bse nse sensex nifty stock market sgx nifty telugu FADA Federation of Automobile Dealers Associations

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending