పండగ సీజన్‌లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి చుక్కలే..

2021-09-15 09:20:43 By VANI

img

పండగ సీజన్ వస్తోందంటే చాలు.. ఆఫర్లు వెల్లువెత్తుతాయని.. కొనాలనుకున్న వస్తువులను కూడా పండగ సమయానికి వినియోగదారులు వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి పండగ సీజన్ మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పండగ సీజన్‌లో ధరలు పెరుగుతాయనే న్యూస్ వచ్చేసింది. తాజాగా స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లను పండగ సీజన్‌కి వాయిదా వేసుకున్న వారికి ఇది నిజంగా చేదు వార్తే.

 

సెమీ కండక్టర్‌ చిప్‌లు సహా కీలక విడిభాగాల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ల విడుదల చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండకపోవడమే కాకుండా హ్యాండ్‌సెట్ల ధరలు కూడా 7 నుంచి 10 శాతం మేరకు పెరిగే ఆస్కారం ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. కనీసం రాబోయే రెండు త్రైమాసికాల పాటు మొబైల్‌ ఫోన్ల పరిశ్రమకు చిప్‌ల కొరత తప్పదని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ అన్నారు. అయితే అంచనాలు మాత్రం మరోలా ఉన్నాయి. ధరలు పెరిగినా పండగల సీజన్‌లో స్మార్ట్‌ ఫోన్లకు డిమాండ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Festival Season  Smart Phone  Tharun Patak

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending