హల్వా ఫెస్టివల్ అయింది.. బడ్జెట్ మిగిలింది

2021-01-30 20:58:20 By Admin

img

హల్వా ఫెస్టివల్ అయింది.. బడ్జెట్ మిగిలింది 

కేంద్ర బడ్జెట్‌ ప్రక్రియకు హల్వా వేడుకతో శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం జరిగింది. బడ్జెట్‌కు పత్రాల ముద్రణ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వేడుక జరుగుతుంది. సాధారణంగా హల్వా వేడుక అనంతరం  ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్వా వేడుక తరువాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులను నార్త్ బ్లాక్ బంకర్ లో 10 రోజులు లాక్ చేస్తారు. అయితే  కరోనా నేపథ్యంలో 2021-22 యూనియన్‌ బడ్జెట్‌ పేపర్లు ముద్రించడం లేదు ఫిబ్రవరి 1న  పార్లమెంటులో ప్రవేశపెెపెద బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ ఫార్మాట్‌లోనే  ఎంపీలకు అందించనున్నారు. జనవరి 29న సమర్పించే ఆర్థిక సర్వే కూడా డిజిటల్ రూపంలో ఉంటుంది.

పేపర్ లెస్ బడ్జెట్...
తొలిసారి పేపర్ లేకుండా డిజిటల్ ఫార్మాట్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ను కూడా  ఆర్థికమంత్రి లాంచ్‌ చేశారు. డౌన్‌లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ అవుట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్ వంటి లింక్స్‌ యాప్ లో ఉంటాయి. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో దీన్ని రూపొందించారు.  ఇంగ్లీష్ , హిందీలో యాప్ ఉంటుంది. 


Budget Halwa