బడ్జెట్ వచ్చేసింది.. మరి వ్యాపారవేత్తల మాటేమిటి
2021-22 బడ్జెట్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పారిశ్రామిక, వ్యాపారవర్గాలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నం చేసిందని మరికొందరు అభినందించారు.
సునీల్ భారతి మిట్టల్, ఎయిర్ టెల్
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో ఎన్నడూ చూడలేదు. దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేలా ఉంది.
గోపిచంద్ హిందూజా, హిందూజా గ్రూప్ ఛైర్మన్
ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్న సమయంలో ఖర్చుకు వెనుకాడకుండా రూ.5.54లక్షల కోట్ల కేపిటల్ వ్యయం ప్రతిపాదించారు. 34.5శాతం పెంచారు. ఉద్యోగ కల్పన పెరుగుతుంది.
అదర్ పూనావాలా, సీరం అధిపతి
ఆరోగ్య రంగానికి ప్రతిపాదించిన కేటాయింపులతో పాటు కొవిడ్ వ్యాక్సినైజేషన్, నిమోనియా వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్ వేగంగా కోలుకుంటుంది.