అగ్రి ఇన్‌ఫ్రా సెస్ వేసినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవట.. !!!

2021-02-01 15:38:54 By Anveshi

img

ప్రతి రోజూ పెరుగుతూ పోతోన్న ఇంధన ధరలకు కేంద్రబడ్జెట్‌లో అగ్రి ఇన్ ఫ్రా సెస్ పేరిట లీటర్ పెట్రోల్‌కు రూ.2.50, డీజిల్‌పై రూ.4 విధించినా..యూజర్లపై మాత్రం ఆ భారం పడదంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఊరట ప్రకటన చేశారు. ఫిబ్రవరి 2 నుంచే..అంటే రేపట్నుంచే అమల్లోకి రాబోతోన్న అగ్రి ఇన్‌ఫ్రాసెస్‌ను వ్యవసాయ, మౌలిక వసతుల కల్పన కోసమే ప్రవేశపెట్టామని చెప్పిన నిర్మలాసీతారామన్, ఇంధన వినియోగదారులపై మాత్రం ఈ సెస్ ప్రభావం ఉండదన్నారు

అది ఎలాగంటే..ఇప్పటిదాకా పెట్రోల్‌పై ఉన్న రూ.1.40పైసలు, డీజిల్‌పై ఉన్న రూ.1.80పైసల బేసిక్ ఎక్సైజ్,డ్యూటీని రద్దు చేస్తామని చెప్పారు. ఇంధనంపై కేంద్రమే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.అలా పెట్రోల్‌పై రూ.11, డీజిల్‌పై రూ.8మేర ఈ బాదుడు ఉంది..ఇప్పుడు కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం,ఈ రకపు సెస్ రద్దై..కొత్తగా వచ్చిన అగ్రి ఇన్‌ఫ్రా సెస్ అమలు కానుందన్నమాట..ఐతే ఏ రాయైతేనేం పళ్లూడగొట్టడానికి అన్నట్లుగా వినియోగదారులకు ధరాఘాతం మాత్రం తప్పదని తెలుస్తోంది. వాస్తవంగా ఇంధన ధరలు ఎలా ఉండబోతున్నాయన్నది కొద్దిరోజుల్లోనే తెలియనుంది


agri infra cess hike price petrol diseal budget 2021