గడిచిన పదేళ్లలో బడ్జెట్ డే రోజు స్టాక్స్ ఎలా స్పందించాయంటే..

2021-02-01 09:06:09 By Y Kalyani

img

గడిచిన పదేళ్లలో బడ్జెట్ డే రోజు స్టాక్స్ ఎలా స్పందించాయంటే..

దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ప్రతి ఏటా రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజులుంటాయి.. ఇందులో ఒకటి మూరత్ ట్రేడింగ్ అయితే.. రెండోది బడ్జెట్ డే. ఇన్వెస్టర్లు ఈ రెండు రోజుల కీలకంగా భావించి తమ కేపిటల్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. బిగ్ డే బడ్జెట్ వచ్చింది. మరి గడిచిన పదేళ్లలో స్టాక్ మార్కెట్ పద్దుల రోజు ఎలా స్పందించింది అంటే.. అత్యధికంగా నష్టాలు రాలేదు.. అధ్బుతమైన లాభాలు పంచలేదు. 0.48 నుంచి 1.75 వరకు లాభాలు వచ్చాయి. 0.16 నుంచి 1.52వరకు నష్టాలు వచ్చాయి. ఒక్కసారి సంవత్సరాల వారీగా చూస్తే.. మొత్తం 11 బడ్జెట్లు ప్రవేశపెడితే నాలుగుసార్లు మాత్రమే మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. మిగిలిన సందర్భాల్లో నష్టాల పాలయ్యాయి. 
ఇయర్ వైజ్ గా చూస్తే...
2010
లో ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. 1.08శాతం మార్కెట్లు గెయిన్ అయ్యాయి.
2011లో 0.69శాతం లాభాల్లో ముగిసింది
2012లో 1.19శాతం నష్టాల్లో ముగిసింది.
2013లో చిదంబరం ప్రవేశపెట్టారు పద్దులు. 1.52 నష్టపోయింది మార్కెట్
2014లోనూ స్టాక్ మార్కెట్ 0.28శాతం నష్టాల్లో ముగిసింది
2015లో మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్ 0.48శాతం లాభాల్లో ముగిసింది
2016లో జైట్లీ బడ్జెట్ అంతగా ఆకట్టుకోలేదు దీంతో 0.66శాతం నష్టపోయింది మార్కెట్
2017లో 1.76శాతం లాభపడింది. దశాబ్ధ కాలంలో 2010-2019 మధ్య హయ్యస్ట్ గెయిన్ ఇది.
2018లో 0.16శాతం నష్టపోయింది
2019లో పీయుష్ గోయల్ ప్రవేశపెట్టినబడ్జెట్ డే నాడు 0.59శాతం పెరిగింది
2020లో గడిచిన దశాబ్థకాలంలో అత్యంత బడ్జెట్ డే ఫాల్ 2.43 శాతం నమోదు అయింది. ఇక నిఫ్టీ బ్యాంకింగ్ అయితే 1026 పాయింట్లు తగ్గింది.


budget stocks market bull berish