బడ్జెట్ టు బడ్జెట్ రికార్డు స్థాయిలో పెరిగిన స్టాక్స్

2021-01-30 20:52:21 By Y Kalyani

img

బడ్జెట్ టు బడ్జెట్ రికార్డు స్థాయిలో పెరిగిన స్టాక్స్
ఈ షేర్లు ఏడాది క్రితం కొని ఉంటే లాభాలే లాభాలు

యూనియన్ బడ్జెట్ వస్తోంది..  స్టాక్ మార్కెట్లో కూడా పద్దుల ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్వల్పంగా అనిశ్చితి ఉన్నా.. కొన్ని స్టాక్స్ లో మాత్రం గ్రీన్ లైన్ కనిపిస్తోంది. ఈక్విటీ మార్కెట్ ఇటీవల 50k మార్కును అందుకుంది. మళ్లీ కరెక్షన్ వచ్చినా.. గత ఏడాది బడ్జెట్ తో చూస్తే భారీగానే సూచీలు లాభపడ్డాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 16శాతం లాభపడింది. అంటే 6734 పాయింట్లు గెయిన్ అయింది. ఇక నిఫ్టీ కూడా 16.25శాతం పెరిగి 1990 పాయింట్లు లాభపడింది. కొన్ని స్టాక్స్ అయితే 800శాతానికి పైగా కూడా పెరిగాయి. ఏడాదిలో భాగా లాభపడ్డ స్టాక్స్ ఇవే...

1.Tanla Platforms
కంపెనీ షేరు గత బడ్జెట్ సమాయానికి ఇప్పటికి మధ్య దాదాపు 845శాతం పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ 7న స్టాక్ వాల్యూ రూ.32.50 పైసలు మాత్రమే. కానీ ఇప్పుడు రూ. 700 వద్ద ట్రేడ్ అవుతోంది. 
2. Alok Industries
కంపెనీ స్టాక్ ఏడాదిలో 538%శాతం పెరిగింది. గతేడాది స్టాక్ వాల్యూ రూ.3.28 ఉండగా.. ప్రజంట్ రూ.17.67గా ఉంది.
3. Laurus Labs
ఫార్మా కంపెనీ స్టాక్ దూసుకెళ్లింది. ఏడాదిలో 359%  వరకూ పెరిగింది. 296 రూపాయిలు పెరిగింది. ప్రజంట్ రూ.385 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ క్యాప్ కూడా రూ.20,380 కోట్లకు చేరింది. 
4. Aarti Drugs
కంపెనీ షేరు వాల్యూ 360శాతం పెరిగింది. స్టాక్ వాల్యూ రూ.561 వద్దకు చేరింది. రూ.155 నుంచి పెరిగింది. హయ్యస్ట్ 733 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ వాల్యూ రూ.6,628.
5.CG Power
షేరు దాదాపు 331% పెరిగింది. అంటే రూ.30.53 పెరిగింది. ప్రజంట్ రూ.39.75 వద్ద ట్రేడ్ అవుతోంది. 


Budget