కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతరామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021 స్టాక్ మార్కెట్లలో
ఉరిమే ఉత్సాహాన్ని నింపింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో సెన్సెక్స్,నిఫ్టీలు
లాభాల బాటలో పయనిస్తున్నాయ్.నిఫ్టీ 627 పాయింట్లకిపైగా లాభంతో 14,259.50 పాయింట్ల దగ్గర
ట్రేడవుతుండగా..సెన్సెక్స్ 4.94 శాతం పెరిగి 2285 పాయింట్లకిపైగా లాభపడి 48,571 పాయింట్లను అధిగమించింది
బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2510 పాయింట్లకి పైగా ఎగసి..ఇండెక్స్‌లను పుష్ చేస్తోంది..బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై పాయింట్లను
తాకడం ఈ సెషన్ విశేషం కాగా..ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బిఐ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా
నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి