మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతంటే..

2021-01-31 22:27:25 By Y Kalyani

img

మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతంటే..


స్వాతంత్ర్యానంతరం తొలిబడ్జెట్ ను 1947లో ప్రవేశపెట్టారు. 1947-48 ఆర్థిక సంవత్సరానికి అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి 1947 నవంబర్ 26వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు ఏడున్నర నెలలకు మాత్రమే బడ్జెట్ ఇది. 
1947 పద్దుల్లో ఆదాయ వ్యయాలు
ఆదాయం అంచనా రూ.171.15 కోట్లు
వ్యయం అంచనా రూ.197.39 కోట్లు
లోటు రూ.26.24 కోట్లు
రూ.171.15 కోట్లలో కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లుగా చూపించారు. పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖల నుంచి ఆదాయం అప్పట్లో అత్యధికంగా ఉండేది. సుమారు రూ.15.9 కోట్లు. 
బడ్జెట్లో ఖర్చు రూ.197.39 కోట్ల అయితే.. రూ.92.74 కోట్లు రక్షణరంగానికే కేటాయించారు మంత్రి. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending