డిఫెన్స్ సెక్టార్ హయ్యస్ట్ బడ్జెట్ గెయినర్

2021-02-01 22:23:37 By Y Kalyani

img

డిఫెన్స్ సెక్టార్ హయ్యస్ట్ బడ్జెట్ గెయినర్
స్టాక్ మార్కెట్లోనూ ఈ రంగానికి ఉద్దీపనే

2021-22 బడ్జెట్లో రక్షణ శాఖకు భారీగా కేటాయించారు. 15 ఏళ్ల తర్వాత అత్యధికంగా కేటాయింపులు జరిపారు. రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 7.4 శాతం పెరిగింది. ఇందులో రూ.1.35 ల‌క్ష‌ల కోట్లు కేపిటల్ వ్యయం కాగా.. గత ఏడాది కంటే ఇది 19శాతం పెరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగానికి నిధులు పెంచినట్టు కనిపిస్తోంది. సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో రీసెర్చ్ రంగంలో వెచ్చించనున్నారు.  ఇక ఆయుధాల కొనుగోలు, మరమ్మతులకు గతేడాది రూ.1,13,734 కోట్లు ఉండగా ఈసారి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 18 శాతం పెంపుతో రూ.1,35,060 కోట్లు కేటాయింపులు చేశారు.

స్టాక్ మార్కెట్ కు ఊతం...
ఇది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోని డిఫెన్స్ సెక్టార్ కు సానుకూలంగా మారనుంది. దేశీయంగా ఆయుధ సంపత్తిపై మోదీ ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే వందకు పైగా ఆయుధాల దిగుమతులపై నిషేధం విధించింది. దేశీయంగా కంపెనీలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజా కేటాయింపులు కూడా దేశీయంగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కంపెనీలపై వెచ్చించనున్నారు. HAL, రిలయన్స్ డిఫెన్స్, టాటా వంటి కంపెనీలకు అనుకూలంగా మారుతుంది. స్టాక్ మార్కెట్లో ఇప్పడిప్పుడే వస్తున్న కొత్త డిఫెన్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. 


budget stocks market bull berish