ఈ బడ్జెట్ సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ బిల్

2021-01-31 21:16:53 By Y Kalyani

img

ఈ బడ్జెట్ సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ బిల్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా త్వరలోనే డిజిటల్ కరెన్సీ రానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబందించిన బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది. 'క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021' పేరుతో బిల్లును ప్రభుత్వం ఆమోదించడానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
బిల్లు వస్తే క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో భారతీయ రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. నియంత్రణ కూడా ఉంటుందని చెబుతున్నారు. 
క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఏప్రిల్ నుండి బిట్ కాయిన్ ధరలు 700 శాతానికి పైగా పెరగడంతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశంలో కూడా మనకంటూ క్రిప్టో కరెన్సీ అవసరాన్ని గుర్తు చేస్తున్నారు మార్కెట్ నిపుణులు. లావాదేవీలు చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇండియాలో క్రిప్టోకరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ నిషేధాన్ని సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది కూడా. అయితే కరెన్సీ విధివిధానాలు ఉంటా ఉంటాయన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నగదు, నాణాలు ద్వారా పెరుగుతున్న వ్యయాన్ని కూడా తగ్గించుకోవడానికి డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తానికి బడ్జెట్ సెషన్ లో దీనిపై ఓ స్పష్టత వస్తుంది.


bitcoin criypto currnecy