2021 బడ్జెట్ లో టాప్ 10 కీ పాయింట్స్

2021-02-01 09:26:08 By Y Kalyani

img

2021 బడ్జెట్ లో టాప్ 10 కీ పాయింట్స్
డ్రీమ్ బడ్జెటా.. కార్పొరేట్ లుక్ ఉంటుందా

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై అందరి చూపూ ఉంది. ఆర్థిక మంత్రిగా ఆమె ఓ కొత్త అధ్యాయం స్రుష్టించారు. గత ఏడాది సాధారణ బడ్జెట్ తర్వాత వరుసగా ప్రకటనల రూపంలో మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. సాధారణ బడ్జెట్ పై విమర్శల రావడం.. మార్కెట్లో తీవ్ర అసంత్రుప్తి కారణంగా మళ్లీ మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత రూ.20లక్షల కోట్లతో కోవిడ్ స్పెషల్ ప్యాకేజీ కూడా ఇచ్చారు. ఇలా ఒకే ఏడాది అనధికారికంగా పలుమార్లు పద్దులు ప్రకటించినట్టే.. మరి ఈ ఏడాది కూడా అలా లేకుండా ఒకేసారి  మొత్తం ప్రకటిస్తారా.. తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది.

టాప్ 10 పాయింట్స్..
1.నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇది 9వ బడ్జెట్
2. ఎకానమీ సర్వైవల్ నుంచి రివైవల్ దిశగా ఉండేలా పద్దులు
3. 11ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది
4.మౌలికం,హెల్త్ కేర్ రంగాలకు అదనంగా 15శాతం కేటాయించే అవకాశం
5.రానున్న 4 ఏళ్లలో జీడీపీలో నాలుగు శాతం వరకూ హెల్త్ కేర్ కు కేటాయించే అవకాశం. ఇందుకోసం 1శాతం హెల్త్ ట్యాక్స్ అదనంగగా పడే అవకాశం ఉంది.
6జకార్పొరేట్ సెక్టార్ పన్నుల రాయితీలు కోరుకుంటున్నారు. భారం కూడా తగ్గించాలని వేడుకుంటున్నారు
7.GST రికార్డు స్థాయిలో వసూళ్లు ఉన్న నేపథ్యంలో కొత్త పన్నులు వేయరని సంకేతాలు
8.గత ఏడాది 2లక్షల కోట్లు డిజిన్విస్టెమెంట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ 10శాతం కూడా చేరుకోలేదు. దీనిపై ప్రధానంగా ద్రుష్టి పెట్టే ఛాన్స్. 
9.బ్యాంకింగ్, మైనింగ్, ఎనర్జీ రంగాల్లో స్టేక్ విక్రయాలకు ప్రాధాన్యం.
10.వ్యాక్సినేషన్ దేశం మొత్తం ఫ్రీగా ఇస్తారా లేదా అన్నది బడ్జెట్ లో తేలనుంది


budget stocks market bull berish

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending