2021 బడ్జెట్ వస్తోంది.. ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలి

2021-01-30 20:59:34 By Admin

img

2021 బడ్జెట్ వస్తోంది.. ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలి
ఇన్ ఫ్రా, హెల్త్ సెక్టార్స్ కు ప్రాధాన్యత

రానున్న కొద్దినెలలు స్టాక్ మార్కెట్ ను బిగ్ డే ఫిబ్రవరి 1 నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై అందరి ద్రుష్టీ ఉంది. వాస్తవానికి కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చింది. అంతేకాదు ప్రభుత్వ ప్రాధాన్యతల విషయంలో మౌలిక మార్పులకు కారణమవుతోంది. ఇందులో భాగంగా రానున్న బడ్జెట్ లో దేశ ఆర్ధిక పురోగతిని అనుగుణంగా మరియు ఉపాథి అవకాశాలు కల్పించే లక్ష్యంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్ ఫ్రా, హెల్త్ కు పద్దుల్లో ప్రాధాన్యత ఉంటుందని అంచనా. ఎందుకంటే పనిదినాలు పెంచడం ప్రభుత్వ లక్ష్యం. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి జాబ్స్ కల్పించే లక్ష్యంతో మౌలిక రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.  
నిర్మల లెక్కల్లో...
2020-21 బడ్జెట్ విషయంలో ఇప్పటికే కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ మరియు మార్కెట్లో డిమాండ్ స్రుష్టించేలా ఉంటుంది. మౌలిక రంగంతో పాటు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. రియల్ ఎస్టేట్, నిర్మాణం, రైల్వే రంగంలో భారీగా నిధులు కేటాయించనున్నారని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా సెక్టార్లలో కీలక స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి, మౌలికం, ఆరోగ్యం వంటి రంగాల్లోని షేర్లపై మదుపుదారులు పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం అంటున్నారు నిపుణులు. 
ఈస్టాక్స్ ట్రై చేయండి..  సలహానే
Varroc Engineering
Kalpataru Power Transmission 
Larsen & Toubro(L&T)
PNC Infratech
Dalmia Bharat
Aurobindo Pharma
Sun Pharmaceutical Industries 
JSW Steel
Glenmark Pharmaceuticals
HUDCO
ప్రదానంగా మార్కెట్లో ఈ స్టాక్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయని.. బడ్జెట్ తర్వాత కంపెనీలకున్న ప్రోఫైల్ కారణంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  ఇది అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం..దీనినే ప్రామాణికంగా తీసుకోవద్దు. నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి.