సింపుల్ గా 10 ముక్కల్లో.. 2021-22 బడ్జెట్ హైలెట్స్

2021-02-01 23:06:28 By Y Kalyani

img

సింపుల్ గా 10 ముక్కల్లో..  2021-22 బడ్జెట్ హైలెట్స్

రెండు గంటల సుదీర్ఘ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి అధికంగా కేపిటల్ వ్యయాన్ని ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఊహించిన విధంగా, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపులు చూపించారు. ఆర్థిక లోటు 9.5% తో బాండ్ మార్కెట్లను ఆశ్చర్యపరిచింది మరియు దానిని తగ్గించే దిశగా మార్గం చూపించారు. 

టాప్ 10 బడ్జెట్ ముఖ్యాంశాలు
1. ఈక్విటీ మార్కెట్లు ప్రసంగం ఉన్నంతసేపూ నెగిటీవ్ లేకుండా 3.5% ర్యాలీ చూపించాయి.
2. ద్రవ్య లోటు FY21లో 9.5% నుండి FY26నాటికి 4.5% కి తగ్గిస్తామని ప్రకటించారు.
3. హెల్త్ సెక్టార్ కు 137% కేటాయింపులు పెంచారు.
4. బిగ్ ఇన్‌ఫ్రా పుష్ కనిపించింది. 34.5% పెంచి రూ.5.54 లక్షల కోట్లుగా ఉంది. 
5. స్థూల వ్యయం 13% పెరిగి రూ.35 లక్షల కోట్ల రూపాయల వద్ద ఉంది. FY22లోనూ సేమ్
6.బ్యాడ్ బ్యాంక్ మరియు బ్యాంకుల్లోకి రూ.20వేల కోట్లు ఇన్ఫ్యూజన్ ఇక రూ.20వేల కోట్లతో DFI
7. డిజిన్విస్టిమెంట్ టార్గెట్ రూ. 1.75 లక్షల కోట్లు. ఇందులో 2 PSU, బీమా సంస్థ, LIC IPO, ఎయిర్ ఇండియా విక్రయం. BPCL, పిఎస్‌యు భూమి అమ్మకం కోసం SPV. బీమాలో ఎఫ్డిఐ 49% నుండి 74% కి పెరిగింది. 
8.  మూడేళ్లలో 7 మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు 
9. డిస్కమ్ లకోసం రానున్న ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల ఫండ్
10. సెబీ, డిపాజిటరీ, SCRAయాక్ట్ ల, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం ఏకీకృత ప్రతిపాదన.


budget stocks market bull berish