బడ్జెట్ అంచనాలకు తగ్గట్టు లేకుంటే.. మార్కెట్ సంగతేంటి

2021-01-30 20:54:56 By Admin

img

బడ్జెట్ అంచనాలకు తగ్గట్టు లేకుంటే.. మార్కెట్ సంగతేంటి
టెంపరరీ కరెక్షనా.. బేరిష్ తప్పదా

స్టాక్ మార్కెట్లో గడిచిన వారం హిస్టారిక్ వీక్ గా చెప్పవచ్చు. ఆల్ టైం గరిష్టానికి చేరుకోవడంతో పాటు.. 50వేల మార్కును అందుకుంది. అయితే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వరసగా రెండు రోజులు నష్టాలతోనే ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అధ్బుతంగా వస్తున్న త్రైమాసిక ఫలితాలు, లిక్విడిటీ, FIIల కారణంగా మార్కెట్లో కొద్ది రోజులుగా జోరు కనిపించింది. వరుస లాభాలతో దూసుకెళ్లింది. 10 నెలల్లో దాదాపు మార్కెట్ డబుల్ అయింది. నవంబరు, డిసెంబర మాసాల్లో అయితే స్టాక్స్ ర్యాలీ సాగింది. 

వరుస నష్టాల ఫార్ములా...
మార్కెట్లో డౌ థీరీ ప్రకారం స్వల్పంగా కరెక్షన్ తప్పనిసరి. బుల్ రన్ లో కొద్దిమంది ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ కు వస్తే.. మార్కెట్లు కరెక్షన్లకు గురౌతాయి. ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి.. ముఖ్యంగా బుల్ రన్ లో కొన్ని స్టాక్స్ ఓవర్ వాల్యేషన్ లో ట్రేడయ్యాయి. పూర్ క్వాలిటీ స్టాక్స్ కూడా భారీగా పెరిగాయి. అవి ఇప్పుడు మళ్లీ వాస్తవ ధరకు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి ఇన్వెస్టర్లు బయటకు వస్తారు. ఈ సమయంలో మార్కెట్ కరెక్షన్ ఉంటుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా కేపిటల్ అంటెన్సీవ్ ఉండే స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిది.

బడ్జెట్ నేపథ్యంలో..
రానున్న కొద్ది వారాలు మార్కెట్ ను బడ్జెట్ శాసిస్తుంది. అప్పటివరకూ బుల్ వర్సెస్ బేర్ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. నిర్మల పద్దులు దగ్గర పడుతున్న కొద్దీ మార్కెట్లో అనిశ్చితి ఇలాగే కొనసాగుతుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. కంపెనీలను సరిగ్గా అంచనా వేసి ఇన్వెస్ట్ చేసే మంచిది. ముఖ్యంగా మంచి స్టాక్స్ ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ బడ్జెట్ కార్పొరేట్ ను మొప్పించకపోయినా షార్ట్ టర్మ్ కరెక్షన్ తప్పదు. 

ఇన్వెస్ట్ మెంట్ ఐడియాస్..
ప్రభుత్వం మార్కెట్లో ఉత్పత్తి పెంచడంతో పాటు వినిమయం పెంచేలా బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉపాథి అవకాశాలు పెంచేందుకు డబ్బు వెచ్చించేలా ఉంటుంది. కాబట్టి ఇన్ ఫ్రా, రియాల్టీ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే మెరుగ్గా ఉంటుంది. ఇప్పటికే సిమెంట్, స్టీల్ రంగాల్లో ఇన్ ఫ్రా రంగాల్లో కార్పొరేట్ ఎర్పింగ్స్ లో ప్రతిబింబిస్తుంది. సొ.. మౌలిక రంగంపై ఇన్వెస్టర్లు ద్రుష్టి సారించవచ్చు.


Budget