ఎన్నో బడ్జెట్లు... అందులో కొన్నే ప్రత్యేకం

2021-01-31 22:20:07 By Y Kalyani

img

ఎన్నో బడ్జెట్లు... అందులో కొన్నే ప్రత్యేకం

ఇండియాలో 1947-48 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 2020 ఫిబ్రవరి 1 వరకు ఎంతోమంది మంత్రులు ఎన్నోసార్లు పద్దులు ప్రవేశపెట్టారు.  అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం...
1. 1947
దేశంలోనే తొలి బడ్జెట్ ఎంతో ప్రత్యేకం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే శణ్ముఖం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ద్వారా ఖర్చు చేయాల్సిన మొత్తంలో 46 శాతాన్ని రక్షణ రంగానికి కేటాయించారు.
2. 1968 బడ్జెట్
మొరార్జీ దేశాయ్ బడ్జెట్. దీన్ని పబ్లిక్ బడ్జెట్ అంటారు. ఆహార కొరత, ద్రవ్యోల్బణం, కరువు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రవేశపెట్టారు. 
3. 1991
ఇది దేశ చరిత్రలోనే మైలురాయి. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్. గ్లోబలైజేషన్, దిగుమతి లైసెన్స్ రద్దు, ఎగుమతులను ప్రోత్సహించడం ఇందులో ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలకు నాంది పలికింది ఇక్కడే. దేశ గతిని మార్చిన బడ్జెట్ ఇది. 
4.1997 
చిదంబరం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్‌పై సర్‌చార్జ్ తొలగింపు, బ్లాక్ మనీని అడ్డుకోవడానికి కొత్త స్కీమ్ వంటి కీలక నిర్ణయాలు తెచ్చారు. 
5. 2000
యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన దీనిని మిలీనియమ్ బడ్జెట్ గా చెబుతారు. సాఫ్ట్‌వేర్ హాబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఐటీ రంగానికి ప్రత్యేకంగా ఇందులో సంస్కరణలు తీసుకొచ్చారు. 
6. 2005 బడ్జెట్
ఆమ్ ఆద్మీ బడ్జెట్ ఇది. చిదంబరం ప్రవేశపెట్టారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది. సమాచారహక్కు చట్టం వచ్చింది కూడా ఇప్పుడే.. ఈ తర్వాత పెద్దగా ఆకట్టుకున్నది ఏవీ లేవు.
మరి నిర్మలమ్మ గత బడ్జెట్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ సారి కోవడ్ నేపథ్యంలో ప్రజల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందరినీ ఆకట్టుకునే ఆమాద్మీ బడ్జెట్ అవుతుంది...చూడాలి.


budget stocks market bull berish