ఆత్మ నిర్భర భారతానికి 6 సూత్రాలు
బడ్జెట్ లో ప్రకటించిన నిర్మలాసీతారామన్
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వెంటాడుతోంది. అయితే కష్ట సమయంలోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆశయంతో బడ్జెట్ కు ప్రాణం పోశారు నిర్మలా సీతారామన్. కరోనాతో నష్టపోయిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. కరోనా సమయంలో అందుకున్న నినాదం ఆత్మ నిర్భర్ భారతం సాకారం చేసుకోవడానికి ప్రధానంగా 6 పిల్లర్స్ ను ప్రకటించారు. ఆరు పిల్లర్స్ ను గుర్తించిన ప్రభుత్వం కేటాయింపులు కూడా ప్యాకేజీగా రూపొందించారు.
1. హెల్త్ సెక్టార్..
కొవిడ్ దేశ ఆరోగ్యంపై ద్రుష్టిపెట్టేలా చేసింది. మొత్తం ఈ రంగానికి రూ.2,23,846 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం అధికం. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసమే రూ. 35వేల కోట్లను కేటాయించాకగ. ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్త్ భారత్ యోజన పథకానికి రూ.64వేల కోట్లు ఇచ్చారు. మిషన్ పోషణ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
2. మౌలిక సదుపాయాలు..
ఆత్మనిర్భర్ భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97లక్షల కోట్లను కేటాయిస్తామన్నారు. 13రంగాల్లో ఖర్చుచేస్తారు. భారీ పెట్టుబడులతో ఏడు టెక్స్టైల్ పార్కులు రానున్నాయి. జాతీయ మౌలిక సదుపాయాల కింద 7400 ప్రాజెక్టులను చేపడతారు. లక్షా 18వేల కోట్ల మూలధనంతో జాతీయ రహదారులు చేపడతారు.
3. సమ్మిళిత సమగ్రాభివ్రుద్ధి..
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయాలు. గోధుమ, వరి, పప్పుధాన్యాల సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతామన్నారు. హర్బర్లను అభివృద్ధి. వలస కార్మికులు, కూలీలకు ఒకే దేశం-ఒకే రేషన్ కార్యక్రమం అమలు ఉంటాయి.
4. మూలధనం పెంపు..
చదువు, నైపుణ్యాలకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వేల పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు.
5. ఇన్నోవేషన్ ఆర్&డీ..
దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. రూ.1500 కోట్లతో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్ లాంగ్వేజీ ట్రాన్స్లేషన్ మిషన్ విధానాన్ని తీసుకొస్తారు.
6. మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమం గవర్నెన్స్..
సత్వర న్యాయం అందించడంతో పాటు.. ట్రైబ్యునల్‌లో సంస్కరణలు. మెరుగైన పాలన అందించడానికి మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.