అమ్మకం లేకపోవడంతో..వెల్లువెత్తిన అమ్మకాలు..! గంజిలో పడ్డ ఈగలా మారిన బిపిసిఎల్ ! 6% పతనమైన షేరు

2022-02-22 14:22:02 By Anveshi

img

ఓవైపు ప్రభుత్వశాఖయేమో ఖచ్చితంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ని అమ్మి తీరుతామని ప్రకటిస్తుంది. మరోవైపు అందుకు సంబంధించిన సూచనలు మాత్రం కన్పించవ్..దీంతో 2022 ఫస్ట్ క్వార్టర్ పూర్తైనా ఇంకా వాటాల విక్రయం ప్రస్తావన లేకపోవడంతో షేర్లను అయినకాడికి అమ్మేస్తున్నారు ట్రేడర్లు

 

డిజిన్వెస్ట్‌మెంట్ మాట ఎత్తితేనే శివాలెత్తిపోయే స్టాక్స్ కొన్ని ఉన్నాయ్. వాటిలో రెండు బ్యాంక్ షేర్లు కనీసం 10శాతం పెరగడం గుర్తుండే ఉంటుంది. వాటి సరసనే BPCL కూడా చేరేది. కానీ ఇప్పుడు
ఆ ఊసే లేకుండా పోవడంతో స్టాక్ ధర ఏకంగా 52వారాల కనిష్టానికి చేరింది.

 

ఇంట్రాడేలో 3.5శాతం పతనమై రూ.356 ధరకి చేరడంతో కొత్త 52వారాల కనిష్టానికి బిపిసిఎల్ చేరినట్లైంది.ఆ తర్వాత ఇంకా దిగిపోయి 349.40కి కూడా పతనం అయింది.
ఫిబ్రవరి నెలలో బిపిసిఎల్ స్టాక్ ఇప్పటికి దాదాపు 13 శాతం పతనమైంది

 

ఇంధన ధరల్లో ఇంకా ప్రభుత్వ జోక్యం కొనసాగుతుండటమే అసలు బిపిసిఎల్‌ వాటాల విక్రయానికి పెద్ద అడ్డంకిగా మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో పేర్కొనడం గమనించాలి. గడచిన మూడు నెలల్లో ఇంతవరకూ ఏ కొత్త కంపెనీ కూడా బిపిసిఎల్‌ను కొనుగోలుకి ముందుకు రాలేదు

 

ప్రభుత్వం BPCLలోని 52.98శాతం వాటా విక్రయించనుండగా మూడు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ బిడ్స్ వచ్చాయ్. వాటిలో వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్‌ది కూడా ఒకటి

 

ఆయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరినా, రేటు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో..ఈ నాలుగో త్రైమాసికంలో మార్జిన్లు పడిపోతాయనే కలవరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయ్. 
ప్రస్తుతం బిపిసిఎల్ షేర్లు రూ.352.85 వద్ద ట్రేడ్ అయ్యాయ్
 


BPCL