స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ సెక్టార్ కు సంస్కరణల బూస్టప్

2021-02-01 22:51:54 By Y Kalyani

img

స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ సెక్టార్ కు సంస్కరణల బూస్టప్
నిఫ్టీ బ్యాంకింగ్ రంగంలో ఇదే దూకుడు
PSUలకు రూ.30వేల కోట్లు
బ్యాండ్ బ్యాంక్ పై ముందే చెప్పిన ప్రాఫిట్ యువర్ ట్రేడ్

బ్యాంకింగ్ రంగానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కలిసొచ్చింది. బ్యాంకింగ్ మరియు భీమా రంగాల్లో సంస్కరణలు కూడా ప్రకటించడంతో సానుకూలంగా స్పందించాయి. అంతేకాదు బ్యాంకుల రూ .20 వేల కోట్ల రీకాపిటలైజేషన్‌ను ఇన్ ఫ్యూజ్ చేస్తారు. మార్కెట్లో నిఫ్టీ బ్యాంకింగ్ రికార్డు స్థాయిలో క్లోజ్ అయింది. వాస్తవానికి కొద్దిరోజులుగా బ్యాంకింగ్ మొండిపద్దలు కారణంగా వస్తున్న త్రైమాసిక  ఫలితాలు ఆశాజనకంగా లేవు. అయినా బడ్జెట్ వాటిని పరిష్కారం చూపింది.  బ్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.బ్యాంకింగ్ రంగంలో ఇది కీలకం నిర్ణయం. ఇక బ్యాంకింగ్ లో మొండిపద్దులు బ్యాడ్ బ్యాంక్ కు వెళతాయి. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ లో తీసేస్తారు. ఈ విషయం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ముందే చెప్పింది. 

బ్యాంకుల్లో వాటాల విక్రయం...
రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియను ఉంటుందని బడ్జెట్లో ప్రకటించారు. ప్రస్తుతం పిఎస్‌యుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వానికి ఉంది. 51 శాతం కంటే తగ్గించాలని లేదా మొత్తం వాటాను ప్రైవేటు యాజమాన్యానికి విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.  చిన్న, మధ్య స్థాయి బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేటీకరించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పిఎన్‌బి వంటి పెద్ద బ్యాంకుల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా ఇతర బ్యాంకులు తీసుకునే అవకాశం ఉంది. 

బీమా కంపెనీల్లోనూ ప్రైవేటీకరణ...
ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్న బీమా సంస్థ పేరును ప్రభుత్వం వెల్లడించలేదు. నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. 

LIC IPO....
2021-22లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC కూడా ఐపీఓకు వస్తోంది. బడ్జెట్ లో అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి గత ఏడాది వద్దామని బావించినా సాధ్యం కాలేదు. రూ .32 లక్షల కోట్ల ఆస్తులతో ఉన్న ఈ కంపెనీ మెగా ఐపిఓగా మారనుంది. 

గత ఏడాది బడ్జెట్లో డిజిన్విస్టిమెంట్ ద్వారా 2.18లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అంచనాలకు ఏమాత్రం దగ్గరగా లేకుండా పోయింది. 10శాతం కూడా చేరుకోలేదు. దీంతో 2021-22 బడ్జెట్లో రూ.1.75లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 


budget stocks market bull berish