22 ఏళ్ల తర్వాత ఇదే అత్యధికం
బడ్జెట్ డే సూపర్ రియాక్షన్
స్టాక్ మార్కెట్ స్పందిన వెనక సీక్రెట్ ఇది
భారతీయ స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపించింది. BSE 5శాతానికి పైగా పెరిగితే.. నిఫ్టీ 4.74శాతం గెయిన్ అయింది. సెన్సెక్స్ 2315 పాయింట్లు జంప్ చేసి 48600కు వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 646.60 పాయింట్లు లాభపడి 14281 వద్ద క్లోజ్ అయింది.
1999లో...
1999 తర్వాత ఇదే ఫస్ట్ టైం మార్కెట్ ఇలా స్పందించడం. దాదాపు 22 ఏళ్ల తర్వాత మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో బడ్జెట్ కు స్పందించాయి. 1999లో BSE సన్సెక్స్ 5.13శాతం పెరిగింది. అంతకుముందు 1997లో ఒకసారి కూడా 6.5శాతం గెయిన్ అయింది.
ఆర్థికమమంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటనలు మార్కెట్లో జోష్ నింపింది. ఉదయం నుంచే లాభాల్లో ట్రేడైన మార్కెట్లు.. బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నంతసేపూ లాభాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. హెల్త్ కేర్ రంగానికిప్రాధాన్యత, బీమా రంగంలో సంస్కరణలు, బ్యాంకింగ్ సెక్టార్ లో మార్పులు, రైల్వే, రోడ్స్, నిర్మాణం వంటి మౌలిక రంగానికి భారీగా నిధుల కేటాయింపుతో స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. 5శాతానికి పైగా గెయిన్ అయింది మార్కెట్. మదుపర్లు షేర్ల కోనుగోలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూడంతో సెన్సెక్స్ భారీగా పెరిగింది.
బాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బిఐ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బ్యాంకింగ్ నిఫ్టీ 8శాతం పెరిగి 33305 వద్ద రికార్డు స్థాయికి చేరి క్లోజ్ అయింది.
బీమారంగంలో ఎఫ్డిఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్ సానుకూలంగా పనిచేశాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ భయాలు ఉన్నా