హైదరాబాద్ కు ఆటో టెక్ కంపెనీ

2020-12-18 21:32:07

img

హైదరాబాద్ కు ఆటో టెక్ కంపెనీ
వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్

ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్లలో ఒకటిగా మారనుంది. ఇందుకోసం కంపెనీ రూ.1,050 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. 2021 చివరి నాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లోని దాదాపు 1,000 మంది నిపుణులకు ప్రారంభం కానుంది. ముంబై ప్రధాన కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎఫ్‌సీఏకు మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో వెహికిల్, పవర్‌ట్రైన్‌ తయారీ సంయుక్త సంస్థ ఉంది. పుణె, చెన్నైల్లో ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కనెక్టెడ్‌ వెహికల్‌ ప్రోగ్రామ్స్‌, పాసింజర్‌ సేఫ్టీ, డిజిటల్‌ షోరూమ్‌లు, ఏఐ, డేటా యాసిలిరేటర్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి వాటిపై ఇక్కడ పరిశోధనలు చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో హుండయ్ కంపెనీకి చెందిన పరిశోధనా సంస్థ ఉంది.  తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్టోరేజీ వ్యవస్థల పాలసీని విడుదల చేసింది. ఎఫ్‌సీఏ కూడా హైదరాబాద్‌లో విడి భాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. ఎఫ్‌సీఏ హైదరాబాద్‌ను ఎంచుకుని సరైన నిర్ణయం తీసుకుందన్నారు.


Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending