జీటీపీఎల్‌ లిస్టింగ్‌.. ప్చ్‌!

జీటీపీఎల్‌ లిస్టింగ్‌.. ప్చ్‌!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న జీటీపీఎల్‌ హాథవే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఆఫర్‌ ధర వద్దే లిస్టయ్యింది. ఇష్యూకి ధర రూ. 170కాగా.. ఇదే స్థాయిలో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 162 వద్ద కనిష్టాన్ని తాకగా.. ప్రస్తుతం 0.9 శాతం లాభంతో రూ. 171.50 వద్ద ట్రేడవుతోంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు రూ. 500 కోట్లను సమీకరించింది. గుజరాత్‌లో నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్న కేబుల్‌ ప్రొవైడర్‌ జీటీపీఎల్‌ హాథవే పబ్లిక్‌ ఇష్యూకి అంతమాత్రంగానే స్పందన వచ్చింది. జూన్‌ 23న ముగిసిన ఇష్యూకి 1.53 రెట్ల స్పందన మాత్రమే లభించింది. 

ఇష్యూకి ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 145 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 170 ధరలో డీబీ ఇంటర్నేషనల్ ఏషియా‌, బీఎన్‌పీ పరిబాస్‌ ఎంఎఫ్‌ తదితర సంస్థలకు మొత్తం 85 లక్షలకుపైగా షేర్లను కేటాయించింది. 
స్టాక్‌ మార్కెట్‌ లిస్టెడ్‌ సంస్థ హాథవే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ కంపెనీకి మాతృ సంస్థకాగా.. కంపెనీ పలురాష్ట్రాలలోని 169 పట్టణాలలో డిజిటల్‌ కేబుల్‌ సర్వీసులను అందిస్తోంది. 5.41 మిలియన్లమంది సబ్‌స్ర్కైబర్లను కలిగి ఉంది.  



Most Popular