బైబ్యాక్ ప్రభావంతో కళకళలాడుతున్న టీసీఎస్‌

బైబ్యాక్ ప్రభావంతో కళకళలాడుతున్న టీసీఎస్‌


త్వరలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బైబ్యాక్‌ ఆఫర్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 20న జరగనున్న బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్‌పై నిర్ణయించనున్నట్లు  టీసీఎస్ వర్గాలు తెలిపాయి. రూ. 7500 కోట్లకు సమానమైన షేర్ల బైబ్యాక్‌ యోచన చేస్తుండగా.. 1.5 శాతం మార్కెట్‌క్యాప్‌కు సమానమైన షేర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు  బైబ్యాక్‌పై మరో ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం ఉంది. 3.9 శాతం విలువైన షేర్ల బైబ్యాక్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పిన టీసీఎస్.. రూ. 18,500 కోట్ల విలువైన మార్కెట్‌ క్యాప్‌కు సమానంగా బై బ్యాక్ చేయనున్నామని తెలిపింది.

ఈ ప్రభావంతో ఈ స్టాక్ ఉదయం నుంచి జోరు చూపిస్తుండగా.. ఒక దశలో రూ. 2,478 గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్.. ప్రస్తుతం 1.44 శాతం లాభంతో రూ. 2450.55 దగ్గర ట్రేడ్ అవుతోంది. Profityourtrade Videos