బీఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూ జోరు

బీఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూ జోరు

బీఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూ రెండో రోజుకే విజయవంతమైంది. షేరుకి రూ. 805-806 ధరలో సోమవారం(23న) మొదలైన ఐపీవో బుధవారం(25న) ముగియనుండగా.. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా దాదాపు రెండు రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. రిటైల్‌ విభాగంలో దాదాపు 54 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. మంగళవారం మధ్యాహ్నానికే 97 లక్షలకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూలో భాగంగా దాదాపు 1.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా..  ఇప్పటివరకూ 1.08 కోట్ల బిడ్స్‌ దాఖలయ్యాయి. బుధవారం సాయంత్రానికి ఇష్యూ అన్ని విభాగాల్లోనూ ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ సాధించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Profityourtrade Videos