SME సండేను నిర్వహించిన SBI

SME సండేను నిర్వహించిన SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం SME సండే ఉత్సవాలను నిర్వహించింది. హైదరాబాద్ కొత్తపేట్  బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి SBI సీజీఎం హరదయాళ్ ప్రసాద్ హాజరయ్యారు. బ్యాంక్ ఉన్నతాధికారులు, ఖాతాదారులు ఈ సమావేశానికి హాజరై తమ సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నారు. SME శాఖకు సంబంధించి కరెంట్ అకౌంట్స్ , అకౌంట్ అసెట్ , టర్మ్ లోన్,  ప్రాజెక్ట్  ఫైనాన్స్ వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. లోన్ల కోసం అప్లయ్ చేసుకున్న కొద్ది రోజులకై మంజూరు చేయడం జరిగిందని SBI ఉన్నతాధికారులు చెప్పారు. మిగితా బ్యాంకులతో పోల్చితే  SBI వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయని తెలిపారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ పారిశ్రామిక రుణాల మంజూరులో దేశంలోనే అగ్రగామిగా ఉందని, మిగిలిన బ్యాంకులకు మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టాండప్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాలకు చేయూతనిచ్చే దిశగా ప్రోత్సహించామన్నారు. 
 



Most Popular

workshop hyderabad recommendations