కొనుగోళ్ల హవా- అన్ని రంగాలూ ఓకే!

కొనుగోళ్ల హవా- అన్ని రంగాలూ ఓకే!

గత వారాంతాన ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడటంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల డబుల్‌ సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ పటిష్టంగా కదులుతోంది. ప్రస్తుతం 175 పాయింట్లు జంప్‌చేసి 34,181ను తాకింది. తద్వారా గత వారంలో నమోదైన భారీ నష్టాలకు చెక్‌ పెట్టింది. ఇక నిఫ్టీ సైతం 50 పాయింట్లు పెరిగి 10,505 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆసియా మార్కెట్లు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు.
ఫార్మా, రియల్టీ జోరు
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, ఫార్మా 2 శాతం చొప్పున జంప్‌చేయగా.. మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1-0.6 శాతం  మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, సన్‌ పార్మా, ఓఎన్‌జీసీ, అరబిందో, లుపిన్‌, యాక్సిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌,యస్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో 3.6-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్‌ప్రాటెల్‌, ఐవోసీ, వేదాంతా 2-0.5 శాతం మధ్య నీరసించాయి.
రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, హెచ్‌డీఐఎల్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఫీనిక్స్‌, యూనిటెక్, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌ 5-1 శాతం మధ్య జంప్‌చేశాయి.



Most Popular